కేరళను కేరళాంగా మార్చారు.. బెంగాల్‌ను బొంగోగా ఎందుకు మార్చరు: మమతా బెనర్జీ

by Ajay Maddhiboyina |

కేరళ త్వరలోనే కేరళంగా మారుతోందని, దశాబ్దాలుగా పేరు మార్పు కోసం పశ్చిమబెంగాల్ కూడా వేచి చూస్తోందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

కేరళను కేరళాంగా మార్చారు.. బెంగాల్‌ను బొంగోగా ఎందుకు మార్చరు: మమతా బెనర్జీ
X

దిశ‌, వెబ్ డెస్క్: కేర‌ళ పేరును కేర‌ళంగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ త్వరలోనే కేరళంగా మారుతోందని, దశాబ్దాలుగా పేరు మార్పు కోసం పశ్చిమబెంగాల్ కూడా వేచి చూస్తోందని తెలిపారు. రాష్ట్రానికి బంగ్లా లేదా బొంగోగా పేరు మార్చాల‌ని 2016 నుండి అనేక అసెంబ్లీ తీర్మానాలు చేసిన‌ప్ప‌టికీ ఎందుకు మార్చ‌లేద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రం నుండి వ‌చ్చిన ఏ ప్రతిపాద‌న‌ను కేంద్రం ఆమోదించ‌లేద‌ని అన్నారు. అంతే కాకుండా త‌మ‌కు ఏ రాష్ట్రం ప‌ట్ల వ్య‌తిరేక‌త లేద‌ని బీజేపీ మ‌రియు సీపీఎం మ‌ధ్య ఒప్పందాలు ఉన్నందుకే కేర‌ళ ప్ర‌తిపాద‌న‌ను ఆమెదించార‌ని అన్నారు. ఇక ఇదిలా ఉంటే కేర‌ళ పేరును కేర‌ళంగా మార్చాల‌నే ప్రతిపాద‌న 2023లో ప్రారంభ‌మైంది. సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ప్ర‌తిపాదించిన ఏక‌గ్రీవ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఇక నిన్న కేంద్రం ఆమోదించ‌డంతో ఇప్పుడు కేర‌ళంగా మారింది.

Next Story