‘అన్నీ తప్పుడు లెక్కలే’: ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

by Gantepaka Srikanth |

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘం (EC) తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘అన్నీ తప్పుడు లెక్కలే’: ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘం (EC) తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లెక్కింపులో అక్రమాలకు పాల్పడుతున్నారని, కావాలనే తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ సరళిపై మమత అసహనం వ్యక్తం చేస్తూ.. "తృణమూల్ కాంగ్రెస్ (TMC) వందకు పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. కానీ ఎన్నికల సంఘం ఆ వివరాలను అధికారికంగా ప్రకటించడం లేదు. ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది" అని మండిపడ్డారు. కేంద్ర బలగాలు, ఈసీ కుమ్మక్కై ఓట్లను తారుమారు చేస్తున్నాయని ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద టీఎంసీ ఏజెంట్లను, నేతలను కేంద్ర బలగాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు సైతం కేంద్ర బలగాలకు లొంగిపోయారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆమె వ్యాఖ్యానించారు.

SIR..

"ఎస్ఐఆర్ (SIR) ఆధారంగా ఓట్లు దొంగిలించే కుట్ర జరుగుతోంది. చాలా చోట్ల లెక్కింపును కావాలనే నిలిపివేశారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు, మనం పోరాడదాం" అని మమత పిలుపునిచ్చారు.

Next Story