Bangladesh : మేమేమైనా లాలీపాప్స్ తింటూ కూర్చుంటామా?- ఆక్రమణలపై దీదీ కామెంట్స్

by Shamantha N |

భారత్- బంగ్లాదేశ్ ల మధ్య ఉద్రిక్తతల వేళ టీఎంసీ అధినేత్రి(Trinamool Congress), పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Bangladesh : మేమేమైనా లాలీపాప్స్ తింటూ కూర్చుంటామా?-  ఆక్రమణలపై దీదీ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్- బంగ్లాదేశ్ ల మధ్య ఉద్రిక్తతల వేళ టీఎంసీ అధినేత్రి(Trinamool Congress), పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం దీదీ బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడారు. "మీరు బెంగాల్, బిహార్, ఒడిశాలను ఆక్రమిస్తే.. మేం లాలీపాప్స్ తింటామా? అస్సలు అలా అనుకోకండి" అని దీదీ అన్నారు. కాగా.. పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశాలపై తమకూ హక్కు ఉందంటూ ఇటీవలే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(Bangladesh Nationalist Party) వ్యాఖ్యానించింది. ఆ కామెంట్లపైనే దీదీ ఇలా ఘాటుగా స్పందించారు. పొరుగు దేశంలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. మీడియా, రాజకీయ నాయకులను ప్రశాంతంగా ఉండాలని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. సరిహద్దు దేశంలోని శాంతిభద్రతలపై ఎలాంట ప్రభావం చూపకుండా చూసుకోవాలని అన్నారు. “హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అల్లర్లను ప్రారంభించరు. సంఘ వ్యతిరేకులు అల్లర్లను ప్రారంభిస్తారు. బెంగాల్‌లో గడ్డు పరిస్థితిని సృష్టించే ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు. బంగ్లాదేశ్ లోని వారి కోసం ఇక్కడి హిందువులు, ముస్లిం మైనారిటీలు నిరసన వ్యక్తం చేయడం సంతోషంగా ఉంది. ఇది భారత లౌకిక స్వభావాన్ని తెలియజేస్తుంది ’’ అని ఆమె అన్నారు.

మీడియా సంయమనం పాటించాలి

బంగ్లాలోని హిందువులకు మద్దతుగా ఇక్కడ మైనారిటీ నాయకులు ర్యాలీ చేపట్టవచ్చని.. కానీ, అల్లర్లు సృష్టించేలా వ్యవహరించవద్దని దీదీ హితవు పలికారు. బంగ్లాదేశ్ పరిస్థితిని కవరేజ్ చేయడంలో మీడియా సంయమనం పాటించాలని మమతా బెనర్జీ కోరారు." మేము మిమ్మల్ని బ్యాన్ చేస్తాం.. అరెస్టు చేస్తాం.. అని బెదిరించడానికి.. ఇది ఉత్తరప్రదేశ్ లేదా రాజస్థాన్ కాదు. కానీ, చాలా ఫేక్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఓ రాజకీయ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తుంది. ఇలాంటి విషయాలపై జాగ్రత్త వహించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా” అని దీదీ మీడియాతో అన్నారు.

Next Story