Mamata Banerjee: పహెల్గాం ఉగ్రదాడి.. కేంద్రం తీరుపై దీదీ విమర్శలు

by Shamantha N |

పహెల్గాం (Pahalgam) ఉగ్రదాడి విషయంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై పశ్చిమబెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister) మమతా బెనర్జీ (Mamata Banerjee) మండిపడ్డారు.

Mamata Banerjee: పహెల్గాం ఉగ్రదాడి.. కేంద్రం తీరుపై దీదీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం (Pahalgam) ఉగ్రదాడి విషయంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై పశ్చిమబెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister) మమతా బెనర్జీ (Mamata Banerjee) మండిపడ్డారు. కేంద్రప్రభుత్వాన్ని హెవీ లోడెడ్ వైరస్ అని విమర్శలు గుప్పించారు. వక్ఫ్ సవరణ చట్టం అమలుతో బెంగాల్ లోని ముర్షీదాబాద్ లో అల్లర్లు చెలరేగాయి. ఆ తర్వాత తొలిసారిగా మమతా బెనర్జీ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆ తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడారు. “వక్ఫ్ చట్టాల వల్ల చెలరేగిన హింసలో ముగ్గురు చనిపోయారు. ఇది పహెల్గామ్ ఉగ్రవాద దాడి నుండే వచ్చింది. వక్ఫ్ చట్టాల హింసతో ప్రభావితమైన వారి కుటుంబాలను సందర్శించకుండా బీజేపీ 'గూండాలు' నన్ను ఆపారు” అని దీదీ మండిపడింది. ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ సరిహద్దులను రక్షించడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు. "మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మతపరంగా విభజించవద్దు. దానికి బదులు దేశాన్ని జాగ్రత్తగా చూసుకోండి. దేశ సరిహద్దుల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మతరాజకీయాలు మానుకుని ప్రజలకు న్యాయం చేయండి” అని విమర్శించారు. ఎన్నికలకు ముందు మా టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ సహాయంతో బీజేపీ రూపొందించిన కుట్రకు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా.. ఆ విషయాన్ని మీడియా ముందు బహిర్గతం చేస్తానని అన్నారు. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు అబద్ధాలను వ్యాప్తి చేయడంలో బీజేపీ చేతుల్లోకి వచ్చాయని చెప్పుకొచ్చారు.

పహెల్గాం ఉగ్రదాడిపై..

అంతేకాకుండా, పహెల్గాం ఉగ్రదాడిలో తమ ఆప్తులను కోల్పోయి బాధలో ఉన్నవారికి న్యాయం చేయాలని మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. దీనిపై డర్టీ పాలిటిక్స్ చేయవద్దని అన్నారు. ఇలాంటి రాజకీయాలను ఏమాత్రం సహించబోనని హెచ్చరించారు. తాను 10 నుంచి 12 మంది ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశానని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రధాని మతకల్లోలాలు సృష్టించడంపై శ్రద్ధ పెట్టడం మానుకుని, సరిహద్దులపై శ్రద్ధ పెట్టాలని అన్నారు. తాను ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. దేశంలో యాక్టివ్‌ ప్రధాని మంత్రి ఎవరో బీజేపీ నేతలకు తెలుసని అమిత్ షాని ఉద్దేశించి దీదీ అన్నారు.

Next Story