బిహార్ ఫలితాన్ని గౌరవిస్తున్నాం.. మా పోరాటం ఆగదు: ఖర్గే

by Phanindra |

బిహార్ ఫలితాన్ని గౌరవిస్తున్నామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. అయితే ప్రజాస్వామ్యం కోసం తమ పోరాటం ఆగదదని చెప్పారు.

బిహార్ ఫలితాన్ని గౌరవిస్తున్నాం.. మా పోరాటం ఆగదు: ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ ఎన్నికల్లో విపక్ష కూటమి ఘోరపరాజయంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఫలితాన్ని స్వీకరించిన ఆయన.. ప్రజాస్వామ్యం కోసం తమ పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ‘బిహార్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అయితే రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తులపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఫలితాన్ని లోతుగా పరిశీలించి, ఇలా ఎందుకు జరిగిందో తెలియజేస్తాం. మా కూటమికి ఓటేసిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ కార్యకర్తలు డీలా పడాల్సిన అవసరం లేదు. మీరే మా గౌరవం, విజయం. మీ కష్టమే మా బలం. ప్రజలకు అవగాహన కల్పించడంలో ఏమాత్రం వెనక్కు తగ్గం. ప్రజల మధ్యనే ఉంటూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇది సుదీర్ఘ పోరాటం.. పూర్తి పట్టుదల, ధైర్యం. నిజాయితీతో పోరాడతాం’ అని ఖర్గే పేర్కొన్నారు.

Next Story