Lishalliny Kanaran : ఆ పూజారి అసభ్యంగా తాకాడు.మలేషియా మోడల్ సంచలన ఆరోపణలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-10 16:10:53  IST  )

ఇండియాలో ఓ పూజారి తనను లైంగికంగా వేధించాడంటూ భారత సంతతికి చెందిన మలేషియా మోడల్, టెలివిజన్ యాకంర్ లిషల్లినీ కనరన్ సంచలన ఆరోపణలు చేసింది.

Lishalliny Kanaran : ఆ పూజారి అసభ్యంగా తాకాడు.మలేషియా మోడల్ సంచలన ఆరోపణలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియాలో ఓ పూజారి తనను లైంగికంగా వేధించాడంటూ భారత సంతతికి చెందిన మలేషియా మోడల్, టెలివిజన్ యాకంర్ లిషల్లినీ కనరన్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె సుధీర్గ పోస్ట్ చేసింది. ఇటీవల తన తల్లితో కలిసి భారత్ వచ్చినట్టు లిషల్లినీ పేర్కొంది. సెపాంగ్‌లోని ఆలయానికి తాను ఒక్కదాన్నే వెళ్లానని ఆ సమయంలో ఓ పూజారి దగ్గరకు వచ్చి పవిత్ర జలాన్ని ఇస్తానని చెప్పినట్టు తెలిపింది. భక్తులు అంతా వెళ్లిపోయిన తరవాత తన ఆఫీసుకు తీసుకువెళ్లాడని చెప్పింది.

అక్కడ ఘాటు వాసనతో ఉన్న ఓ జలాన్ని పైన చల్లి శరీరాన్ని అసభ్యంగా తాకుతూ ఇలా చేస్తే దేవుడి ఆశీస్సులు ఉంటాయని అన్నాడని తెలిపింది. ఆయన చేస్తుంది తప్పని తెలిసినా తాను అచేతనంలోకి వెళ్లిపోయానని అలా ఎందుకు వెళ్లానో అర్థం కాలేదని చెప్పింది. తాను పార్టీలకు, ఈవెంట్లకు వెళ్లినప్పుడు కూడా ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడు ఆలయం నుండి పారిపోయాడని చెప్పినట్టు తెలిపింది. ఆలయ అధికారులు అతడిని కాపాడే ప్రయత్నం చేయడంతో న్యాయం కోసం సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నట్టు పేర్కొంది.

Next Story