- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలులో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన ఐదు బోగీలు
by Gantepaka Srikanth |
తమిళనాడులోని తిరువళ్లూరు(Tiruvallur) సమీపంలో భారీ రైలు ప్రమాదం(Train Accident) జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని తిరువళ్లూరు(Tiruvallur) సమీపంలో భారీ రైలు ప్రమాదం(Train Accident) జరిగింది. చెన్నై నుంచి బెంగళూరు వెళుతున్న గూడ్సు రైలులో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. మొత్తం ఐదు వ్యాగన్లకు మంటలు అలుముకున్నాయి. దీంతో చెన్నై - అరక్కోణం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్రాక్ గుండా వచ్చే ప్రయాణికుల రైళ్లను దారి మళ్లిస్తున్నారు. డీజిల్ తరలిస్తున్న రైలు కావడంతో ముందు జాగ్రత్తగా విద్యుత్ నిలిపివేశారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






