- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో మరో షాకింగ్ ఘటన.. ఢిల్లీలో పట్టాలు తప్పిన రైలు
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఘోర రైలు ప్రమాదం(Train Accident) జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఘోర రైలు ప్రమాదం(Train Accident) జరిగింది. ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జి స్టేషన్ సమీపంలో హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఘజియాబాద్ వెళ్లే 64419 రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల సమాచారంతో విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి.. దాదాపు 242 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కాసేపట్లో ట్రెయిన్ ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరువకముందే ఢిల్లీలో రైలు ప్రమాదం.
— greatandhra (@greatandhranews) June 12, 2025
ఢిల్లీలో శివాజీ బ్రిడ్జి స్టేషన్ సమీపంలో హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఘజియాబాద్ వెళ్లే 64419 రైలు పట్టాలు తప్పింది.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.#RailAccident #Delhi pic.twitter.com/IwPZQ992ho






