- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగ్‌పూర్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. RSS హెడ్‌క్వార్టర్స్ వద్ద పేలుడు పదార్థాల డంప్ లభ్యం
నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ప్రధాన కార్యాలయం సమీపంలో అత్యంత శక్తివంతమైన పేలుడు లభించడం తీవ్ర కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ (Nagpur)లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభించడం ఒక్కసారిగా కలకలం రేపింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఈ పదార్థాలు దొరకడంతో పోలీసులు, భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. నాగ్‌పూర్ పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు నగరంలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్ హెడ్‌క్వార్టర్స్‌కు కూతవేటు దూరంలో అనుమానాస్పద స్థితిలో ఏర్పాటు చేసి డంప్‌లో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. అందులో 15 జిలెటిన్ స్టిక్స్ (Gelatin Sticks), 50 డిటోనేటర్లు (Detonators) 8 కనెక్టర్లు (Connectors) ఉన్నాయి. ఈ మేరకు వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, వెంటనే బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS)కు సమాచారం అందించారు.
రంగంలోకి బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ టీమ్స్..
అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్ ఆ పదార్థాలను నిర్వీర్యం చేసే ప్రక్రియను చేపట్టింది. అదేవిధంగా, ఫోరెన్సిక్ నిపుణులు (Forensic Experts) అక్కడి నమూనాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటిని ఇక్కడ ఎవరు ఉంచారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ పరిణామం చోటుచేసుకోవడంతో నాగ్‌పూర్ వ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇది ఏదైనా కుట్రలో భాగమా లేక పొరపాటున అక్కడకు చేరాయా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం నాగ్‌పూర్ పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.






