Fire accident: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. కిటికీలోంచి బిడ్డను విసిరేసిన తల్లి.. ఆ తర్వాత?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-01 09:14:16  IST  )

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది

Fire accident: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. కిటికీలోంచి బిడ్డను విసిరేసిన తల్లి.. ఆ తర్వాత?
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో (Rajastan) గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అజ్మీర్‌లోని (Ajmer) నాజ్ హోటల్‌లో (Hotel Naaz) అగ్ని ప్రమాదం (Fire accident) సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో హోటల్ భవనం మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ, చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. ఇక ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్‌లోని వారు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ మహిళ తన బిడ్డను కిటికీలోంచి బయటకు విసిరేసింది. మూడో అంతస్తు నుంచి కిందకు విసరగా.. అక్కడున్న వారు చిన్నారిని పట్టుకున్నారు. ఆమె కూడా అలానే దూకేందుకు ప్రయత్నించగా.. మంటల ధాటికి సాధ్యపడలేదు. మంటల్లోనే చిక్కుకుపోయినట్లు సమాచారం. చిన్నారికి మాత్రం స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. హోటల్‌లోని ఓ గదిలో ఏసీ పేలడం వల్ల షార్ట్ సర్య్కూట్ అయి ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story