‘సోలార్’ పాలసీలో భారీ మార్పులు.. వినియోగదారులపై పెను భారం

by Kema Shiva Kumar |

కేంద్ర ప్రభుత్వం సోలార్ పాలసీలో కీలక మార్పులు చేసింది. పీఎం సూర్యఘర్ వంటి పథకాలకు లోకల్ సోలార్ సెల్స్, ప్యానల్స్ వాడటం తప్పనిసరి చేయడంతో వినయోగదారులకు ఆర్థికంగా పెను భారం పడనుంది.

‘సోలార్’ పాలసీలో భారీ మార్పులు.. వినియోగదారులపై పెను భారం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సోలార్ విద్యుత్ (Solar Electricity) వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాల నిబంధనలలో కీలక మార్పులు తీసుకొచ్చింది. సోలార్ పాలసీలో చేసిన సవరణలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే, ఈ కొత్త నిర్ణయం వల్ల ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకునే సామాన్య వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

లోకల్ ప్యానల్స్, సెల్స్ ఇక మస్ట్..

కేంద్ర తాజా నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన వంటి సబ్సిడీ ప్రాజెక్టులకు ఇకపై కచ్చితంగా దేశీయంగా తయారైన సోలార్ సెల్స్‌నే ఉపయోగించాల్సి ఉంటుంది. గతంలోనే సోలార్ ప్యానల్స్ కూడా లోకల్‌వే వాడాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వగా, ఇప్పుడు సెల్స్‌ను కూడా దేశీయంగా తయారైనవే వాడాలని స్పష్టం చేసింది. దేశీయ తయారీ రంగాన్ని (Domestic Manufacturing) ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

కస్టమర్లపై నేరుగా ప్రభావం..

విదేశీ మార్కెట్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులతో పోలిస్తే, మేడ్ ఇన్ ఇండియా (Made in India) సోలార్ సెల్స్, ప్యానల్స్ ధరలు మార్కెట్లో కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా, ఇకపై కొత్తగా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారికి ఖర్చు పెరగనుంది. ప్రతి ఒక కిలోవాట్ (1 KW) సామర్థ్యం గల సోలార్ సిస్టమ్‌పై దాదాపు రూ.3 వేల వరకు అదనపు భారం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఒక ఇంటికి 3 కిలోవాట్ల సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే, కస్టమర్లకు సుమారు రూ.9 వేల వరకు అదనపు ఖర్చు కానుంది. సోలార్ ప్యానల్స్‌లో ఉండే చిన్న చిన్న సోలార్ సెల్స్ సూర్యరశ్మిని గ్రహించి నేరుగా విద్యుత్‌గా మారుస్తాయి. ఈ సెల్స్ అన్నింటినీ కలిపి ఓ ప్యానల్‌గా తయారు చేస్తారు. ఈ ప్యానల్స్ ద్వారానే పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి (Power Generation) జరుగుతుంది. ప్రభుత్వ సబ్సిడీ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ఇకపై ఈ అదనపు ధరను భరించక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఏర్పడింది.

Next Story