- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామంలో విషాదం .. బావిలోకి దిగిన ముగ్గురు అన్నాదమ్ములు మృతి..
యూపీ బిజ్నోర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరక్తల్ గ్రామంలో ముగ్గురు అన్నాదమ్ముల మరణం స్థానికంగా కన్నీరు పెట్టిస్తుంది. చతర్‌పాల్ సింగ్, కాశీష్ సొంత అన్నాదమ్ములు కాగా కజిన్ బ్రదర్ హిమాన్షును తీసుకుని ట్యూబ్ వెల్ దగ్గరకు వెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్ : యూపీ బిజ్నోర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరక్తల్ గ్రామంలో ముగ్గురు అన్నాదమ్ముల మరణం స్థానికంగా కన్నీరు పెట్టిస్తుంది. చతర్‌పాల్ సింగ్, కాశీష్ సొంత అన్నాదమ్ములు కాగా కజిన్ బ్రదర్ హిమాన్షును తీసుకుని ట్యూబ్ వెల్ దగ్గరకు వెళ్లారు. మోటార్ బెల్ట్‌ను సరి చేసే ప్రయత్నంలో ముందుగా చతర్‌పాల్ బావిలోకి దిగగా.. స్పృహ కోల్పోయాడు. దీంతో అతన్ని కాపాడేందుకు వెంట వెంటనే కాశీష్, హిమాన్షు కూడా 20 అడుగుల లోతున్న బావిలోకి దిగారు. అక్కడికి వెళ్లేసరికి వారు కూడా స్పృహ తప్పి పడిపోయారు. అయితే అక్కడే ఉన్న గ్రామస్తుడు ఇదంతా చూసి అరవడంతో.. తర్వాత చేతన్ అనే వ్యక్తి ఫేస్‌కు మాస్క్ పెట్టుకుని బావిలోకి దిగి.. గ్రామస్థుల సహాయంతో ముగ్గురిని బయటకు లాగాడు. వెంటనే వారిని దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. బావిలో విషవాయువు కారణంగా ఊపిరాడక మరణించారని తెలిపారు.






