మాజీ మంత్రి సుభాష్ సింగ్ కన్నుమూత..

by Mallepaka Hamsa |   (  Updated:2022-08-16 15:03:35  IST  )

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ మాజీ మంత్రి సుభాష్ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు..Latest Telugu News

మాజీ మంత్రి సుభాష్ సింగ్ కన్నుమూత..
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ మాజీ మంత్రి సుభాష్ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు బీహార్ ఉప ముఖ్యమంత్రి తర్కిషోర్ ప్రసాద్ ట్వీట్‌లో ట్విట్టర్ ద్వారా నివాళ్లర్పించారు.

''బీహార్ ప్రభుత్వ మాజీ మంత్రి, గోపాల్‌గంజ్ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మృతికి హృదయపూర్వక నివాళులు. దేవుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయన మరణం బీహార్ రాజకీయాలకు, బీజేపీకి తీరని లోటు." అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

వాజ్పేయికి రాష్ట్రపతి సహా ప్రముఖుల నివాళి

Next Story