- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన మైథిలి ఠాకూర్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లి నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన మైథిలి ఠాకూర్ దేశ రాజకియాల్లో సరికొత్త చరిత్ర సృస్టించారు.

దిశ, వెబ్ డెస్క్: బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగ్గా అధికార ఎన్డీయే కూటమి (NDA alliance) ఎవరూ ఊహించని స్థాయిలో 202 స్థానాల్లో విజయం సాధించి. ఈ ఎన్నికల్లో అనేక మంది కొత్త ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో సింగర్, మైథిలి ఠాకూర్ (Mythili Thakur) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశం మొత్తం ఆమె గెలుపుకోసం ఎంతో ఎదురు చూశారు. అల్లినగర్ నియోజకవర్గం నుంచి పోటి చేసిన ఆమె 11 వేలకు పైగా ఓట్లతో సీనియర్ నాయకుడిపై గెలిచి.. బిహార్ అసెంబ్లీ చరిత్ర (History of Bihar Assembly)లో అతి పిన్న వయస్కురాలు అయిన ఎమ్మెల్యేగా నిలిచింది. ఈ విజయంతో మైథిలీ ఠాకూర్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్ర రాశారు.
గాయకురాలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మైథిలి, తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. 2000 జూలై 25న జన్మించిన ఆమె, యువతకు ప్రాతినిధ్యం వహించే నాయకురాలిగా వెలుగులోకి రావడం బిహార్ రాజకీయాల్లో ప్రత్యేక చర్చనీయాంశమైంది. అయితే “దేశంలో 2000 తర్వాత జన్మించి MLA అయిన మొదటి అభ్యర్థిగా ఆమె నిలిచారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ప్రజలు నమ్మకంతో తమకు అవకాశం ఇచ్చారని మైథిలీ పేర్కొన్నారు. యువత రాజకీయాల్లోకి ముందుకు రావాల్సిన సమయం ఇదేనని ఆమె విజయం మరోసారి స్పష్టం చేసింది.






