- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nilamben Parikh: మహాత్మా గాంధీ ముని మనవరాలు కన్నుమూత
మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పారీఖ్ (93) కన్నుమూశారు.

దిశ, వెబ్ డెస్క్: మహాత్మా గాంధీ (Mahatma Gandhi) ముని మనవరాలు నీలంబెన్ పారీఖ్ (93) (Nilamben Parikh) కన్నుమూశారు. ఆమె మంగళవారం (ఏప్రిల్ 1వ తేదీ) వయోభారంతో గుజరాత్‌లోని నవ్‌సిరిలో తుదిశ్వాస విడిచారు. ఈమె మహాత్మా గాంధీ కుమారుడైన హరిదాస్ గాంధీ మనవరాలు. ఇక నీలంబెన్ నవ్‌సిరిలో తన కుమారుడు డాక్టర్ సమీర్ పారీఖ్‌తో కలిసి నివసిస్తున్నారు. ఇక బుధవారం ఉదయం 8 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. నీలంబెన్ గాంధేయ భావజాలాన్ని విశ్వసించారు. తన జీవితాన్ని మహిళా సంక్షేమం, మానవ సేవ కోసం పనిచేశారు.
తన తల్లికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నీలంబెన్ కుమారుడు సమీర్ తెలిపారు. అయితే, తీవ్రమైన ఆస్టియోపోరోసిస్ ఉందని, ఈ క్రమంలోనే రోజు రోజుకు క్షీణించినట్లు చెప్పారు. అలాగే, ఆమె కుటుంబంపై గాంధీ సిద్ధాంతాలను రుద్దకపోయినా, ఆమె వ్యక్తిగత విలువలే తన జీవితంలో తనకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు.






