Maharashtra': మహారాష్ట్రలో మటన్ విక్రయాల్లో కొత్త మార్పు

by Shamantha N |

మహారాష్ట్ర ప్రభుత్వం మటన్ విక్రయాల్లో నూతన మార్పుని తీసుకొచ్చింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జట్కా మటన్ దుకాణాలను మల్హర్ సర్టిఫికేట్ కింద నమోదు చేసుకోవాలని ఆ రాష్ట్ర మంత్రి నితేష్ రాణే అన్నారు.

Maharashtra: మహారాష్ట్రలో మటన్ విక్రయాల్లో కొత్త మార్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ప్రభుత్వం మటన్ విక్రయాల్లో నూతన మార్పుని తీసుకొచ్చింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జట్కా మటన్ దుకాణాలను మల్హర్ సర్టిఫికేట్ కింద నమోదు చేసుకోవాలని ఆ రాష్ట్ర మంత్రి నితేష్ రాణే అన్నారు. జట్కా మాంసంసరఫరాదారుల కోసం మల్హర్ సర్టిఫికేషన్. కామ్ అనే ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మల్హర్ సర్టిఫికేట్ కింద నమోదైన దుకాణాలను హిందువులు మాత్రమే నిర్వహిస్తారని చెప్పారు. రాణే మాట్లాడుతూ.. " హిందూ సమాజం కోసం ఒక ముఖ్యమైన అడుగు వేశాం. దీంతో హిందువులు జట్కా మటన్ విక్రయించేందుకు మార్గం సులభతరం అయ్యింది" అని రాణే అన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో హలాల్ సర్టిఫికేషన్ అమల్లో ఉంది. ఈ దుకాణాలు ముస్లిం చట్టానికి అనుగుణంగా మాంసం అమ్ముతాయి. అంతేకాకుండా, మల్హార్ సర్టిఫికేషన్ లేని దుకాణాల నుండి హిందువులు మటన్ కొనవద్దని కోరారు. మేక లేదా గొర్రె మాంసాన్ని తయారు చేసి హిందూ మత సంప్రదాయాల ప్రకారం బలి ఇస్తారని మల్హర్ వెబ్‌సైట్ ఉంది.

Next Story