- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ganeshotsav 2025: గణేష్ ఉత్సవాలు.. భజనీ మండళ్లకు రూ.25 వేలు మంజూరు
ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి (Ganesh Chaturthi) రోజు నుంచి దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి (Ganesh Chaturthi) రోజు నుంచి దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు వాయిద్యాలను కొనుగోలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం భజనీ మండలాలు (భక్తి సంగీత బృందాలు)కు రూ.25000 మంజూరు చేసిందని మంత్రి ఆశిష్ షెలార్ తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్ర అంతటా ఉన్న 1800 భజనీ మండలాలకు ఈ గ్రాంట్ ను అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 6 లోగా https://mahaanudan.org వెబ్ పోర్టల్ లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇక ముంబైలోని ప్రసిద్ధ కమ్యూనిటీ గణేష్ సంఘమైన జీఎస్బీ సేవా మండల్ ఈ ఏడాది 5రోజుల పాటు నిర్వహించే గణేష్ ఉత్సవాలకు రూ.474.46 కోట్ల బీమా రక్షణను పొందినట్లు ఒక అధికారి వెల్లడించారు. గతేడాది రూ.400.58 కోట్ల బీమా రక్షణ పొందిందని గుర్తు చేశారు. అక్కడ గణేష్ విగ్రహాన్ని భక్తులు విరాళంగా ఇచ్చిన విలువైన వస్తువులతో పాటు.. 69 కిలోల బంగారు ఆభరణాలు, 336 కిలోలకు పైగా వెండి తో అలంకరించినట్లు జీఎస్బీ సేవా మండల్ చైర్మన్ అమిత్ పాయ్ తెలిపారు.






