- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Yuti: ఏక్‌నాథ్ షిండేను సత్కరించిన శరద్ పవార్.. శివసేన యూబీటీ ఫైర్
మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో విభేదాలు నెలకొన్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు మహాద్జీ షిండే రాష్ట్ర గౌరవ్ అవార్డు లభించింది.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని మహాయుతి కూటమి (Mahayuthi alliance)లో విభేదాలు నెలకొన్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath shinde)కు మహాద్జీ షిండే రాష్ట్ర గౌరవ్ అవార్డు లభించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మహాయుతి కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad pawar) షిండేకు అవార్డును అందజేశారు. దీంతో శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay raut) శరద్ పవార్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. మోసం చేసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేసిన షిండేను శరద్ ఎలా సత్కరిస్తారని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. ‘మహారాష్ట్ర ప్రజల ముందుకు ఇప్పుడు ఏ ముఖంతో వెళ్తాం? రాజకీయాల్లో స్నేహితులు, శత్రువులు ఉండరనే నమ్మకం సరైందే కావచ్చు. కానీ మహారాష్ట్రకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు అలాంటి గౌరవం ఇవ్వడం రాష్ట్ర గుర్తింపునకు హానికరం. రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యం కాదు. శివసేనను విచ్ఛిన్నం చేసిన వారిని గౌరవించడం బాధాకరం. ఢిల్లీ రాజకీయ వాతావరణం భిన్నంగా ఉండొచ్చు. కానీ అలాంటి వాటిని మనం సహించలేం’ అని తెలిపారు.
తప్పేమీ లేదు: ఎన్సీపీ (ఎస్పీ)
షిండేకు పవార్ అవార్డును ప్రదానం చేయడంలో తప్పు లేదని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ డాక్టర్ అమోల్ కోహ్లే (Amol kohle) అన్నారు. ‘ఇది రౌత్ వ్యక్తిగత అభిప్రాయం అని నేను భావిస్తున్నా. ప్రతిదానిలోనూ రాజకీయాలను తీసుకురాని విధంగా పవార్ రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. దానిలో తప్పు లేదని నేను అనుకోను. ఆయన ఈ కార్యక్రమానికి రిసెప్షన్ కమిటీ అధ్యక్షుడు’ అని తెలిపారు. కాగా, మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘోర పరాజయం పాలవడంతో అప్పటి నుంచి కూటమిలోని పార్టీల మధ్య పరస్పరం విభేదాలు చోటు చేసుకుంటున్నాయి.






