Maha Kumbhamela: అట్టహాసంగా ప్రారంభమైన మహా కుంభమేళ.. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-13 03:35:31  IST  )

ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్‌ (Prayagraj)లో భూ‌‌మండలంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళ (Maha Kumbhamela) ఇవాళ తెల్లవారుజామున అట్టహాసంగా ప్రారంభమైంది.

Maha Kumbhamela: అట్టహాసంగా ప్రారంభమైన మహా కుంభమేళ.. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్‌ (Prayagraj)లో భూ‌‌మండలంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళ (Maha Kumbhamela) ఇవాళ తెల్లవారుజామున అట్టహాసంగా ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి సందర్భంగా తొలి షాహీస్నాన్‌ (Shahisnan)లో భాగంగా గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు మొత్తం 45 రోజుల పాటు భక్తజన కోలాహలం మధ్య మహా కుంభమేళ జరగనుంది. ఈ ఆధ్యత్మిక వేడుకకు దేశ, విదేశాల నుంచి భక్తులు, సాధ్వీలు, సాధువులు దేశవిదేశాల నుంచి తరలివస్తున్నారు.

ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 35 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళ (Maha Kumbhamela)కు హాజరుకానున్నట్లుగా ప్రభుత్వం అంచానా వేస్తోంది. అందుకు తగినట్లుగా భక్తుల రద్దీ, భద్రత దృష్ట్యా యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. 45 రోజుల పాటు కొనసాగనున్న మహా కుంభమేళాకు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ (Uttar Pradesh Government) రూ.7 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. గతంలో కంటే ఈసారి కుంభమేళాకు 25 శాతం అదనంగా స్థలాన్ని కేటాయించినట్లుగా అధికారులు వెల్లడించారు.

Next Story