- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maha Kumbh: 12 లక్షల మందికి ఉపాధి కల్పించనున్న మహా కుంభమేళా
దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ సోమవారం ప్రకటనలో తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవమైన మహా కుంభమేళా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 13-26 తేదీల మధ్య ఈ ఉత్సవం జరగనుంది. అయితే, ఇంత పెద్ద వేడుక కారణంగా వివిధ రంగాల్లో 12 లక్షల మందికి గిగ్, తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. 40 కోట్ల మందికి పైగా భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని గ్లోబల్ టెక్నాలజీ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాలకు చెందిన వారి నుంచి సేకరిచిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలను లెక్కగట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో తాత్కాలిక ఉపాధి పెద్ద ఎత్తున జరుగుతుందని, కీలక పర్యాటక, ఆతిథ్య రంగాల్లో మాత్రమే 4.5 లక్షల మందిని ఉపాధి లభిస్తుందని సచిన్ అలుగ్ చెప్పారు. వీటిలో టూర్ గైడ్, ట్రావెల్ కన్సల్టెంట్లు, హోటల్ స్టాఫ్, ఈవెంట్ కో-ఆర్డినేటర్ వంటివి ఉన్నాయి. అలాగే, రవాణా రంగంలో 3 లక్షల మందికి, తాత్కాలికంగా ఏర్పాటు చేసే వైద్య శిబిరాల్లో 1.5 లక్షల మందికి అవకాశాలు లభిస్తాయని అధ్యయనం వెల్లడించింది. వర్చువల్ దర్శన్ యాప్‌లు, రియల్ టైమ్ ఈవెంట్ అప్‌డేట్ ప్లాట్‌ఫామ్‌లు, సైబర్‌సెక్యూరిటీని నిర్వహించడానికి దాదాపు 2 లక్షల మంది నిపుణులు అవసరమని, ఐటీ, టెక్నాలజీ రంగ నిపుణులకు అధిక డిమాండ్ ఉండనుంది. భక్తుల అవసరాలను తీర్చే రిటైల్ వ్యాపారాలు మతపరమైన వస్తువులు, సావనీర్‌లు, స్థానిక ఉత్పత్తుల డిమాండ్‌ను తీర్చడానికి ఆన్-గ్రౌండ్ సేల్స్, కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కోసం సుమారు లక్ష ఉద్యోగాల సృష్టి జరుగుతుందని సచిన్ స్పష్టం చేశారు.






