- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maha Kumbh: మహా కుంభమేళాకు10 కోట్లకుపైగా భక్తులు.. వెల్లడించిన యూపీ ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వచ్చే సందర్శకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Mahakumba mela) కు వచ్చే సందర్శకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నెల 13న జాతర ప్రారంభం కాగా గురువారం మధ్యాహ్నం12 గంటల వరకు సుమారు10 కోట్ల మంది భక్తులకు పైగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ (Utharapradesh) ప్రభుత్వం వెల్లడించింది. యాత్రికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందేందుకు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాగ్ రాజ్‌కు వస్తున్నారని తెలిపింది. గురువారం ఒక్కరోజే మధ్యాహ్నం వరకు 30 లక్షల మంది త్రివేణి సంగమంలో స్నానాలు చేశారని పేర్కొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యధికంగా 3.5 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని పేర్కొంది. భక్తుల సంఖ్య దృష్యా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని స్పష్టం చేసింది. ఈ నెల 29న మౌని అమావాస్య అమృత స్నానం ఉంటుందని, ఈ సందర్భంగా యాత్రికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని నిర్వహకులు భావిస్తు్న్నారు. కాగా, కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది.






