- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumb Mela: మహిళలు స్నానం చేస్తుండగా వీడియో.. జర్నలిస్ట్ అరెస్ట్
మహా కుంభమేళా(Mahakumb Mela)లో మహిళలు స్నానం చేస్తుండగా వీడియో తీసిన జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మహా కుంభమేళా(Mahakumb Mela)లో మహిళలు స్నానం చేస్తుండగా వీడియో తీసిన జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ(UP)లోని ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. కుంభమేళాను వీక్షీంచేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రభుత్వం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భారీ ఏర్పాటు చేసింది. ప్రయాగ్ రాజ్ లో గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల కలయికగా ఏర్పడిన త్రివేణి సంగమం వద్ద భక్తులు స్నానాలు ఆచరించడం ప్రాముఖ్యతగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే స్నాన ఘాట్ వద్ద పుణ్య స్నానాలు చేస్తున్న మహిళలను కమ్రాన్ అల్వి అనే లోకల్ జర్నలిస్ట్(Local Journalist) వీడియోలు తీశాడు. అంతేగాక వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, దీనిపై అసభ్యకరమైన కామెంట్లు పెట్టాడు. ఇది కాస్త వైరల్ కావడంతో, కొందరు వ్యక్తులు పోలీసులను ట్యాగ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియో తీసిన జర్నలిస్ట్ పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.






