Maha Kumbh Mela: మహాకుంభమేళా స్పేస్ వ్యూ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

by Shamantha N |

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళా (Kumbh Mela 2025)కు భక్తులు పోటెత్తుతున్నరు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఈ వేడుకతో కళకళలాడుతోంది.

Maha Kumbh Mela: మహాకుంభమేళా స్పేస్ వ్యూ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళా (Kumbh Mela 2025)కు భక్తులు పోటెత్తుతున్నరు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఈ వేడుకతో కళకళలాడుతోంది. ఈ కుంభమేళాకు సంబంధించిన స్పేస్‌ వ్యూ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) విడుదల చేసింది. భారతదేశంలోని అధునాతన ఆప్టికల్ శాటిలైట్స్ ద్వారా పగలు, రాత్రి వీక్షించగల రాడార్‌శాట్‌లను ఉపయోగించి.. కుంభమేళాలో మౌలిక సదుపాయాల కల్పన ఎలా జరిగిందో హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన చిత్రాల్లో కన్పిస్తోంది. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ హౌస్‌లు, ఫ్లోటింగ్ బ్రిడ్జిల ఏర్పాటుతో గత కొద్దినెలలకు ఇప్పటికీ మధ్య తేడా స్పష్టమవుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్‌ కూడా ఆ శాటిలైట్ చిత్రాల్లో కన్పించింది. 2024 ఏప్రిల్ 6న తీసిన ఫొటోలో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపించగా.. 2024డిసెంబర్ 22, 2025 జనవరి 10 చిత్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలతో పాటు అక్కడి శివాలయ పార్క్‌ కూడా కన్పించింది. భారతదేశం మ్యాప్‌లా అది కనిపించింది.

45 రోజులపాటు..

ఇదిలా ఉండగా, జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహాకుంభమేళాలో 40కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారని అంచనా. కాగా..45 రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని ట్రేడింగ్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే 12 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కూడా లభిస్తుందని తెలిపాయి. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది పుణ్యస్నానాలు చేసేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పటికే వెల్లడించారు. మహా కుంభమేళా కోసం దాదాపు 26 హెక్టార్ల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారుయ అంతేకాకుండా, దాదాపు 12 కిలోమీటర్ల అదనపు స్నాన ఘాట్‌లను సృష్టించారు.

Next Story