Maha Kumbh: మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం.. యూపీ సీఎంకు ప్రధాని మోడీ ఫోన్ !

by vinod kumar |
Maha Kumbh: మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం.. యూపీ సీఎంకు ప్రధాని మోడీ ఫోన్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలో జరుగుతున్న మహాకుంభమేళా (Maha kumbamela) లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం శాస్త్రి బ్రిడ్జి సమీపంలోని సెక్టార్ 19 క్యాంపులో రెండు సిలిండర్లు పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో దాదాపు100కు పైగా టెంట్లు కాలి బూడిదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే కుంభమేళా వద్ద ఉంచిన అగ్రిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టి తక్కువ టైంలోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 500 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.2.5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. చుట్టుపక్కల గుడారాల్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించారు.

విషయం తెలుసుకున్న అనంతరం సీఎం యోగీ ఆదిత్యనాథ్ (yogi aadityanath) ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ సైతం యోగీకి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 7.72 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఆదివారం ఒక్కరోజే 46.95 లక్షల మంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed