BIG BREAKING: నీట్ ఫలితాలకు బ్రేక్.. స్టే విధించిన మద్రాస్ హైకోర్టు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-17 13:22:08  IST  )

త్వరలోనే నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా.. మద్రాస్ హైకోర్టు ఫలితాలను ఆపాలంటూ స్టే విధించింది. దీంతో నీట్ రిజల్ట్స్ విడుదలకు బ్రేక్ పడినట్లయింది.

BIG BREAKING: నీట్ ఫలితాలకు బ్రేక్.. స్టే విధించిన మద్రాస్ హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకై జాతీయస్థాయిలో మే 4వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన నీట్ యూజీ 2025 (NEET UG 2025) ఎంట్రన్స్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 23 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకోగా 20.8 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. త్వరలోనే నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా.. మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఫలితాలను ఆపాలంటూ స్టే విధించింది. దీంతో నీట్ రిజల్ట్స్ (NEET Results) విడుదలకు బ్రేక్ పడినట్లయింది. తదుపరి విచారణను కోర్టు జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhya Pradesh High Court) ఇండోర్ బెంచ్ కూడా నీట్ ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

నీట్ పరీక్షా కేంద్రాల్లోని ఒక చోట విద్యుత్ సరఫరా ఆగిపోవడం వల్ల జరిగిన వివాదం కారణంగా నీట్ ఫలితాలను ఆపాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. తమ పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల వెలుతురు సరిగా లేకుండానే పరీక్ష రాయాల్సి వచ్చిందని, విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని 13 మంది విద్యార్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష ప్రక్రియ, నిజాయితీ, సమగ్రతలపై పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story