- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి ముస్లిం మత సంస్థ వక్ఫ్ ఆస్తి కాదు: మద్రాస్ హైకోర్టు
ప్రతి ముస్లీం మత సంస్థ వక్ఫ్ బోర్డ్ ఆస్తి కిందకు రాదని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో ఉన్న 240 ఏళ్ల పురాతన దర్గాను వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తూ తమిళనాడు వక్ఫ్ బోర్డ్ ఇచ్చిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ముస్లీం మత సంస్థ వక్ఫ్ బోర్డ్ ఆస్తి కిందకు రాదని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో ఉన్న 240 ఏళ్ల పురాతన దర్గాను వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తూ తమిళనాడు వక్ఫ్ బోర్డ్ ఇచ్చిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది. చట్టం నిర్దేశించిన విధానం అనుసరించకుండా సంస్థపై నియంత్రణను అమలు చేయడానికి బోర్డుకు అధికార పరిధి లేదని పేర్కొంది. జస్టిస్ కే. గోవిందరాజన్ తిలకపూడి ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. జస్టిస్ కే. గోవిందరాజన్ మాట్లాడుతూ.. ముస్లీం మత సంస్థలో దర్గా ఉన్నంత మాత్రాన ఆ సంస్థను చట్టానికి అనుగుణంగా వక్ఫ్ బోర్డు నిర్మించనంత వరకు బోర్డుకు దానంతట అది స్వాధీనం చేసుకునే హక్కు ఉండదని అన్నారు. సంస్థపై నియంత్రణ చేపట్టే ముందు బోర్డు తప్పనిసరిగా దానికి సంబంధించిన ఆధారాలను పరిశీలించాలన్నారు.






