- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MA Baby : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)(CPM) నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ(MA Baby) ఎన్నికయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)(CPM) నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ(MA Baby) ఎన్నికయ్యారు. ఆదివారం తమిళనాడు(Tamilanadu)లోని మధురై(Madhurai)లో జరిగిన 24వ పార్టీ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. గత ఏడాది సీతారాం ఏచూరి(Sitaram yechuri) మరణం తర్వాత ప్రకాష్ కారత్ తాత్కాలిక బాధ్యతలు నిర్వహించగా నేడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏంఏ బేబీని, 18 మందితో కూడిన పొలిట్ బ్యూరోను ఎన్నుకున్నారు. అదేవిధంగా 85 మంది సభ్యులతో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. కేరళకు చెందిన ఈ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఇఎంఎస్ నంబూదిరిపాద్ తర్వాత కేరళ నించి ఈ పదవిని చేపట్టిన రెండవ వ్యక్తిగా నిలిచారు.
1954లో కొల్లంలో జన్మించిన బేబీ విద్యార్థి దశలోనే SFI ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, DYFIలో కీలక పాత్ర పోషించారు. 1986-1998 మధ్య రాజ్యసభ సభ్యుడిగా, 2006-2011లో కేరళ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2012 నుండి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. మధురైలో జరుగుతున్న మహాసభల్లో శనివారం బేబీ పేరు ప్రతిపాదించబడి.. నేడు పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీలో ఆమోదం పొందింది. పార్టీకి జనాదరణ పెంచాలనే లక్ష్యంతో బేబీ పనిచేస్తారని, పార్టీ బలాన్ని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు కృషి చేస్తారని అంతా భావిస్తున్నారు.






