- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi: రాహుల్ గాంధీకి రూ.200 జరిమానా
కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఉత్తరప్రదేశ్ లోని కోర్టు జరిమానా విధించింది. పదే పదే కోర్టుకి హాజరుకావట్లేదని రూ.200 ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఉత్తరప్రదేశ్ లోని కోర్టు జరిమానా విధించింది. పదే పదే కోర్టుకి హాజరుకావట్లేదని రూ.200 ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాహుల్‌పై పరువు నష్టం దావా కేసు నమోదైంది. కాగా.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఏప్రిల్ 14న కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని లక్నోలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (ACJM) వెల్లడించింది. విచారణకు హాజరుకాకపోతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. రాహుల్ గైర్హాజరయితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని పేర్కొంది.
అసలు కేసు ఏంటంటే?
మహారాష్ట్రలో 2022లో మీడియా సమావేశంలో వీర్ సావర్కర్ గురించి రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు స్వాతంత్ర్య సమరయోధుడైన వీర్ సావర్కర్‌ను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా రాహుల్ కామెంట్స్ ఉన్నాయని అందులో పేర్కొన్నాడు. ఈ కేసులోనే కోర్టు విచారణ జరిపింది. రాహుల్ గాంధీ తరఫున న్యాయవాది ప్రన్షు అగర్వాల్ హాజరై.. ప్రస్తుతం రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారని, వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే, రాహుల్ తరఫు న్యాయవాది అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.






