రాహుల్‌ గాంధీకి రూ.200 జరిమానా విధించిన లక్నో కోర్టు

by Gantepaka Srikanth |

సావర్కర్‌(Savarkar)పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి లక్నో కోర్టు(Lucknow Court) రూ.200 జరిమానా విధించింది.

రాహుల్‌ గాంధీకి రూ.200 జరిమానా విధించిన లక్నో కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: సావర్కర్‌(Savarkar)పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి లక్నో కోర్టు(Lucknow Court) రూ.200 జరిమానా విధించింది. నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో రాహుల్‌కు జరిమానా విధించింది. వచ్చే ఏప్రిల్ 14వ తేదీన కచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం(Maharashtra election campaign)లో సావర్కర్‌పై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్ వారికి సావర్కర్ లేఖ రాశారని, తన చర్యలకు క్షమాపణ చెప్పారని, తద్వారా మహాత్మాగాంధీ, ఇతర స్వాంతంత్ర్య యోధుల పోరాటాన్ని నీరుగార్చారని రాహుల్ గాంధీ అన్నారు.

దీంతో చరిత్రను రాహుల్ గాంధీ(Rahul Gandhi) వక్రీకరించారని, సావర్కర్(Savarkar) వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుని అగౌరవపరిచారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ న్యాయవాది నృపేంద్ర పాండే కోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం లక్నో కోర్టు రాహుల్‌కు సమన్లు పంపింది. 2025 జనవరి10న కోర్టు ముందు హాజరు కావాలని లక్నో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. అయితే రాహుల్ హాజరు కాలేదు. దీంతో సీరియస్ అయిన కోర్టు.. రాహుల్‌ గాంధీకి రూ.200 జరిమానా విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టుకు హాజరు కావాలని మరోసారి నోటీసులు సైతం జారీ చేసింది.

Next Story