- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్పపీడనం.. నాలుగురోజుల్లో మారనున్న వాతావరణం : ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడినట్లు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడినట్లు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న నాలుగురోజుల్లో దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణం మారనున్నట్లు తెలిపింది. కేరళ, దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉందన్నారు. నేడు, రేపు, దక్షిణ తమిళనాడు తీరంతో పాటు మన్నార్ సింధుశాఖ, కొమొరిన్ ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ సమయంలో సముద్రపు అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రస్తుతం భారీ వర్షాల ముప్పు లేనప్పటికీ తీరప్రాంతం, కొండప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






