సోన్‌మార్గ్ రావడానికి ఆసక్తిగా ఉన్నా : ప్రధాని మోడీ

by Ajay Maddhiboyina |

దీని వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎకస్‌లో ఒక పోస్టు పెట్టారు.

సోన్‌మార్గ్ రావడానికి ఆసక్తిగా ఉన్నా : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో:

జమ్ము కశ్మీర్‌లో నూతనంగా నిర్మించిన టన్నెల్ ప్రారంభోత్సవానికి సోన్‌మార్గ్ రావడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోన్‌మార్గ్ ప్రాంతంలో 'జెడ్ మోడ్' టన్నెల్ నిర్మాణం ఇటీవలే పూర్తయ్యింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా, దీని వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎకస్‌లో ఒక పోస్టు పెట్టారు. దీనిని రీట్వీట్ చేస్తూ ప్రధాని మోడీ పై విధంగా స్పందించారు. ఈ టన్నెల్ అందుబాటులోకి వస్తే టూరిజం, ఇతర రంగాలకు కలిగే ఆర్థిక ప్రయోజనాలను సీఎం ఒమర్ చక్కగా వివరించారని ప్రశంసించారు. కాగా రూ.2,700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 12 కిలోమీటర్ల టన్నెల్‌ను ప్రధాని మోడీ ఈ నెల 13న ప్రారంభించనున్నారు. సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ టన్నెల్ వల్ల శ్రీనగర్-సోన్‌మార్గ్ మధ్య ప్రయాణం సులభతరం కానున్నది.

Next Story