- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amit Shah: వందేమాతరం పాడిన వండర్ కిడ్.. గిటార్ గిఫ్ట్ ఇచ్చిన అమిత్ షా
వందేమాతరం పాడిన ఏడేళ్ల వండర్ కిడ్ కి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) గిటార్ బహుకరించారు. కాగా.. ప్రస్తుతం అమిత్ షా ఈశాన్య రాష్ట్రం అసోంలో పర్యటనలో ఉన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: వందేమాతరం పాడిన ఏడేళ్ల వండర్ కిడ్ కి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) గిటార్ బహుకరించారు. కాగా.. ప్రస్తుతం అమిత్ షా ఈశాన్య రాష్ట్రం అసోంలో పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే శనివారం మిజోరాంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ఏడేళ్ల చిన్నారి ఎస్తేర్ లాల్దుహోమి హ్నమ్తే (Esther Lalduhawmi Hnamte ) వందేమాతరాన్ని పాడింది. ఆ చిన్నారిని అభినందిస్తూ గిటార్‌ను బహుమతిగా ఇచ్చారు. ‘దేశంపై ప్రేమ మనల్ని ఏకం చేసింది. వండర్ కిడ్ ఎస్తేర్ లాల్దుహోమి హ్నమ్తే వందేమాతరాన్ని పాడి నా హృదయాన్ని కదిలించింది. ఏడేళ్ల చిన్నారికి భారత మాతపై ఉన్న ప్రేమ తన పాటలో కనిపించింది’ అని అమిత్ షా ఎక్స్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, చిన్నారి పాడిన పాట వీడియోను కూడా ఆయన షేర్ చేసుకున్నారు. ఎస్తేర్ 2020లో ‘మా తుజే సలామ్’ పాట వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె అనేక అవార్డులను అందుకుంది.
అసోం శాంతిపై..
మిజోరాం ప్రజలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. పర్యటకం, సాంకేతికత, వ్యవసాయం, వ్యవస్థాపకతతో సహా వివిధ రంగాలలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అసోం రైఫిల్స్ ప్రధాని కార్యాలయాన్ని సెంట్రల్ ఐజ్వాల్ నుంచి జోఖావ్‌సాంగ్‌కు మార్చామని.. దీంతోనే, రాష్ట్రఅభివృద్ధిపై కేంద్రానికి ఉన్న నిబద్ధత ఏంటో తెలుస్తుందన్నారు. ఈ చర్య కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదని, మిజోరాం ప్రజలపై ప్రభుత్వం చూపిస్తున్న బాధ్యతకు ప్రతీకగా పేర్కొన్నారు.






