ఉద్యోగితో లవ్ అఫైర్.. ప్రముఖ కంపెనీ సీఈఓపై వేటు

by Naga Rani Yarlagadda |

తోటి ఉద్యోగితో లవ్ అఫైర్ (Love Affair) నడిపినట్లు విచారణలో తేలడంతో.. కంపెనీ సీఈఓను ఉద్యోగం నుంచి తొలగించింది ప్రముఖ సంస్థ

ఉద్యోగితో లవ్ అఫైర్.. ప్రముఖ కంపెనీ సీఈఓపై వేటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తోటి ఉద్యోగితో లవ్ అఫైర్ (Love Affair) నడిపినట్లు విచారణలో తేలడంతో.. కంపెనీ సీఈఓపై నెస్లే (Nestle CEO) సంస్థ వేటు వేసింది. సబార్డినేట్ తో ప్రేమ వ్యవహారం నడిపిన సీఈఓ లారెంట్ ఫ్రీక్సేను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రహస్యంగా ఆమెతో లవ్ రిలేషన్ షిప్ నడిపినట్లు తేలడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నెస్లే నిబంధనలకు కంపెనీలో ఉద్యోగులు లవ్ రిలేషన్షిప్ లో ఉండటం విరుద్ధమని పేర్కొంది. ఈ వ్యవహారంపై ఛైర్మన్ పాల్ బుల్కే, లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పాబ్లో ఇస్లా డైరెక్షన్లో దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించింది. కాగా.. నెస్లే నెక్స్ట్ సీఈఓగా ఫిలిప్ నవ్రాటిన్ బాధ్యతలు చేపట్టినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2001లో ఆయన కంపెనీ ఇంటర్నల్ ఆడిటర్ గా కెరీర్ ను ప్రారంభించారు.

Next Story