- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనిల్ అంబానీకి BIG షాక్.. లుకౌట్ సర్క్యూలర్ జారీ
ప్రముఖ బడా పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ(Anil Ambani)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు భారీ షాకిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బడా పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ(Anil Ambani)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు భారీ షాకిచ్చారు. లుకౌట్ సర్క్యూలర్(Lookout Circular) జారీ చేశారు. రుణాలు తీసుకొని బ్యాంకులను మోసం చేశారని మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని అనిల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే అనిల్ అంబానీకి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 5న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రూ.వేల కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది. దాదాపు మూడు వేల కోట్లు చట్టవ్యతిరేక పద్ధతుల్లో దారిమళ్లించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. రిలయన్స్ (Reliance Group) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న రూ.10వేల కోట్ల రుణాలను కూడా దారి మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది.






