- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా(Lok Sabha Speaker Om Birla) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చేవరకు సభకు హాజరు కావొద్దని నిర్ణయించుకున్నారు. మార్చి 9వ తేదీన అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరుగనుంది. ఇదిలా ఉంటే.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. ఈ తీర్మానంపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకేతో సహా పలు పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రజాప్రయోజన అంశాలు లేవనెత్తకుండా స్పీకర్ పదేపదే అడ్డుకోవడం తీవ్రంగా బాధించిందని విపక్షాలు పేర్కొన్నాయి.
ఇదీ కాంగ్రెస్ నేతల ఆవేదన
పలు సందర్భాల్లో విపక్ష నేతలు మాట్లాడటానికి అనుమతించడం లేదు. అది వారి ప్రాథమిక హక్కు. ఎనిమిది మంది విపక్ష ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. వారి రాజ్యాంగపరమైన హక్కులను వినియోగించుకున్నందుకు శిక్షకు గురయ్యారు అని కాంగ్రెస్ నేతలు ఆవేదన చెందారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో విపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)కి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబెపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో అవిశ్వాస తీర్మానం డిమాండ్‌ను విపక్షాలు తెరపైకి తెచ్చాయి.






