లోక్ సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా రాజీనామా

by Prasad Jukanti |

లోక్ సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా రాజీనామా చేశారు.

లోక్ సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా రాజీనామా
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా రాజీనామా చేశారు. ఓం బిర్లా 17వ లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 18వ లోక్ సభకు స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయన కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. కాగా స్పీకర్ పదవి కోసం నామినేషన్లకు రేపు (జూన్ 25) మధ్యాహ్నం 12 గంటల వరకు తుది గడువు విధించారు. ఈనెల 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనున్నది. మరో వైపు లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం కొనసాగుతున్నది. సోమవారం 280 మంది ఎంపీలు ప్రమాణం చేయగా మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Next Story