- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించాలి.. లోక్ సభలో ప్రతిపక్షాల ఆందోళన
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 11వ రోజూ లోక్ సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి.

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 11వ రోజూ లోక్ సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. సోమవారం సభా కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే బిహార్ లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ గందరగోళం సృష్టించాయి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నినాదాలు చేశాయి. దీంతో సభకు అంతరాయం కలగగా స్పీకర్ ఓం బిర్లా (Om Birla) మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్‌సభలో ఇదే అంశంపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేకపోవడంతో మంగళవారానికి పోస్ట్ పోన్ చేశారు. దీంతో ఎటువంటి చర్చ జరగకుండానే లోక్ సభ వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు శిబూ సోరెన్ మృతికి సభ నివాళులర్పించింది. అనంతరం ఆయన గౌరవార్థం చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కార్యకలాపాలు నిలిపివేసి సభను వాయిదా వేశారు.
ప్రభుత్వం చర్చకు అంగీకరించాలి: ప్రియాంక గాంధీ
బిహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ చాలా పెద్ద సమస్య అని దానిపై చర్చకు ప్రభుత్వం అంగీకరించి ముందుకు సాగాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతుంటే ఆ సమస్యను ఎందుకు లేవనెత్తకూడదని ప్రశ్నించారు. దీనిని చర్చించడానికి ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తుందో సమాధానం చెప్పాలన్నారు.






