9 మంది కాంగ్రెస్ నేతలకు నోటీసులు

by Gantepaka Srikanth |

తొమ్మిది మంది కాంగ్రెస్ నేతలకు లోక్‌సభ సచివాలయం నోటీసులు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ ఓంబిర్లాపై ఏఐ వీడియో ప్రచారం చేశారని నోటీసుల్లో పేర్కొంది.

9 మంది కాంగ్రెస్ నేతలకు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తొమ్మిది మంది కాంగ్రెస్(Congress) నేతలకు లోక్‌సభ సచివాలయం(Lok Sabha Secretariat) నోటీసులు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ ఓంబిర్లాపై ఏఐ వీడియో ప్రచారం చేశారని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని డెడ్‌లైన్ పెట్టింది. సభా హక్కులు ఉల్లంఘించి తప్పుడు వీడియోను ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడింది.

మరోవైపు ఇప్పటికే రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు కాంప్లెక్స్‌లోకి వీధి కుక్కను తీసుకురావడంతో పాటు, ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలకు కమిటీ సిద్ధమైంది. ఎంపీ రేణుకా చౌదరిపై బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదును రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ స్వీకరించింది. ఫిబ్రవరి 23లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆమెను ఆదేశించినట్టు తెలుస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 1న ఎంపీ రేణుకా చౌదరి ఒక వీధి కుక్కను తన కారులో పార్లమెంటు కాంప్లెక్స్ లోకి తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

Next Story