కొనసాగుతున్న వాయిదాల పర్వం.. లోక్సభ మూడోసారి వాయిదా

by Malleboina Mahesh |

భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి.

కొనసాగుతున్న వాయిదాల పర్వం.. లోక్సభ మూడోసారి వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon sessions of Parliament).. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో పహల్గాం టెర్రర్ ఎటాక్ (Pahalgam Terror Attack) విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం, టెర్రరిస్టులను అరెస్ట్ చేయకపోవడంపై చర్చించాలని పట్టుబట్టారు. అదేవిధంగా పహల్గాం టెర్రర్ అటాక్‌పై ప్రధాని మోడీ జవాబు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో మొదట 12 గంటల వరకు లోక్ సభ వాయిదా (Lok Sabha adjourned) పడగా.. ఆ తర్వాత 2 గంటల వరకు సభ వాయిదా పడింది. అనంతరం రెండు గంటలకు సభ ప్రారంభం అయిన కొద్ది సేపటికే ప్రతిపక్షాలు సభకు అడ్డుపడటంతో స్పీకర్ సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రారంభం అయిన మొదటి రోజే సభ వరుసగా మూడుసార్లు వాయిదా (Postponed three times in a row) పడింది. మరో పక్క రాజ్య సభలోను ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంతో ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభ వాయిదా పడింది. లోక్ సభ, రాజ్య సభ రెండింటిలోను పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చకు విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ట్రంప్ మధ్యవర్తిత్వం వివాదంపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.

Next Story