Lock down in India: భారత్‌లో లాక్ డౌన్ తప్పదా?

by Dishanational2 |
Lock down in India: భారత్‌లో లాక్ డౌన్ తప్పదా?
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ బీఎఫ్ 7 వేరియంట్ ప్రజల్లో కలవరం సృష్టిస్తోంది. కరోనా తగ్గి పోయింది అనుకునేలోపే మళ్లీ విజృంభన మొదలైంది. ఇప్పటికే ఈ వేరియంట్ విజృంభనతో చైనాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందడంతో చైనాలో లాక్ డౌన్ విధించారు. అంతే కాకుండా జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

దీంతో భారత్ అప్రమత్తమైంది. రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు.

ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చేవారికి కొవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. అలాగే ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు ఆర్టీపీసీ ఆర్ టెస్ట్ చేస్తూ.. లక్షణాలు కనిపించిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.

భారతదేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదంట. అయితే కొన్ని దేశాలలో కేసులు పెరుగుతున్నందువల్ల భారతదేశంలో కూడా పటిష్టమైన నిగా మరియు జాగ్రత్తలు తీసుకోకపోతే లాక్ డౌన్ ఖచ్చితమే అని నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని లేని యెడల భారత్‌కు కరోనా ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.


Next Story

Most Viewed