literate: సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్.. ప్రకటించిన సీఎం సుఖు

by B.Srinivas |

హిమాచల్‌ ప్రదేశ్ ను సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సోమవారం ప్రకటించారు.

literate: సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్.. ప్రకటించిన సీఎం సుఖు
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్‌ ప్రదేశ్‌ను సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) సోమవారం ప్రకటించారు. సిమ్లాలో డైరెక్టరేట్ ఆఫ్ స్కల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో అక్షరాస్యతా రేటు 99.30శాతానికి చేరుకుందని, ఇది జాతీయ ప్రమాణం 95 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. నిర్ణీత కాలపరిమితి కంటే ముందే ఈ లక్ష్యాన్ని చేరుకున్నట్టు చెప్పారు. 7శాతం అక్షరాస్యత రేటు నుంచి పూర్తి అక్షరాస్యతకు చేరుకోవడంలో అనేక సవాళ్లున్నాయని, అయినప్పటికీ నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా, ఒక రాష్ట్రంలో 95శాతం లేదా అంతకంటే ఎక్కువ జనాభా అక్షరాస్యులుగా మారినప్పుడు, ఆ రాష్ట్రాన్ని పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటిస్తారు.

Next Story