- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP దూకుడు.. 144 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ (BJP) తాజాగా 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం విడుదల చేసింది. ఉత్తర మరియు దక్షిణ బెంగాల్‌లోని పలు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు పాల్గొని, క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.
తొలి జాబితాలో ప్రముఖులు వీరే..
బీజేపీ విడుదల చేసిన ఈ జాబితాలో పార్టీకి చెందిన ఉద్ధండులు మరియు విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులకు చోటు దక్కింది. నందిగ్రామ్ నుంచి సువేందు అధికారి, అసన్సోల్ దక్షిణ్ నుంచి అగ్నిమిత్ర పాల్, శిబ్‌పూర్ నుంచి రుద్రనీల్ ఘోష్, ఉలుబేరియా దక్షిణ్ నుండి స్వామి మంగళానంద పురి మహారాజ్, చక్దా నుంచి బంకిం చంద్ర ఘోష్, పాంస్కురా నుంచి సుబ్రతా మైత్రా, దేగంగా నుంచి తరుణ్ కాంతి ఘోష్ నుంచి బరిలోకి దిగుతున్నారు.
ఎన్నికల బరిలో ఆధిక్యం కోసం..
మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మెజారిటీ సాధించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు దీటైన పోటీ ఇచ్చేలా, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ 144 మందిని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను కూడా వెల్లడించనున్నారు.






