- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య ఎఫెక్ట్.. ఆ రోజు మద్యం షాపులు బంద్
యావత్ భారత దేశం ఎదురు చూస్తున్న అయోధ్య గుడి నిర్మాణం దాదాపు పూర్తి కావొస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: యావత్ భారత దేశం ఎదురు చూస్తున్న అయోధ్య గుడి నిర్మాణం దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ నెల 22 అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం రోజును డ్రై డే గా ప్రకటించాయి. దీంతో ఈ నెల 22న మద్యం షాపులు పూర్తిగా మూసివేయబడతాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఆ రోజు మాంసం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు. ఈ నెల 22 ను డ్రై డే గా ప్రకటించిన రాష్ట్రాల్లో.. ఉత్తర ప్రదేశ్, అసోం, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ లు ఉన్నాయి. శ్రీరాముని గుర్తులు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఉండటంతో అయోధ్య మందిర ప్రారంభోత్సవం రోజు రెండు రాష్ట్రాల్లో కూడా డ్రై డే గా ప్రకటించాలని రామ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






