సోషల్ మీడియాలో లైక్ చేయడం వేరు.. షేర్ చేయడం వేరు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

by Ramesh Goud |

సోషల్ మీడియాలో లైక్ (Like) చేయడం వేరు.. షేర్ (Share) చేయడం వేరు అని అలహాబాద్ హైకోర్టు (Alahabad High Court) వ్యాఖ్యానించింది.

సోషల్ మీడియాలో లైక్ చేయడం వేరు.. షేర్ చేయడం వేరు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో లైక్ (Like) చేయడం వేరు.. షేర్ (Share) చేయడం వేరు అని అలహాబాద్ హైకోర్టు (Alahabad High Court) వ్యాఖ్యానించింది. ఇమ్రాన్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అదర్స్ (Imran Khan Vs State Of UP And Others) కేసు విచారణలో భాగంగా కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. భారత రాష్ట్రపతికి మెమోరాండం అందజేయడానికి సంబంధించిన నిరసన ర్యాలీ గురించి ప్రస్తావిస్తూ.. చౌదరి ఫర్హాన్ ఉస్మాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దీనిని ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి లైక్ చేశాడు.

దీంతో పోలీసులు ఇమ్రాన్ చర్యను శాంతికి విఘాతం కలిగే చర్యగా భావిస్తూ.. భారత శిక్షా స్మృతిలో ఐటీ చట్టం (IT Act)లోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ.. ఇమ్రాన్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ సౌరభ్ శ్రీవాస్తవ (Justice Sourabh Srivastava).. ప్రస్తుత కేసులో దరఖాస్తుదారుడు చట్టవిరుద్దమైన సమావేశానికి సంబంధించిన ఓ వ్యక్తి పోస్టును లైక్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని తెలిపారు.

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేయడం, రీట్వీట్ చేయడం లాంటివి చేసినప్పుడు ప్రసారం చేయబడిందని చెప్పవచ్చు.. కానీ లైక్ చేయడం అంటే.. ఆ పోస్ట్ ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం లాంటిది కాదని పేర్కొన్నారు. అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ 67 అనేది అశ్లీల విషయాలను ఎదుర్కోనప్పుడు ఉపయోగించాలని, రెచ్చగొట్టే విషయాలకు ఉపయోగించరాదని చెబుతూ.. ఇమ్రాన్ పై పెట్టిన కేసును రద్దు చేస్తున్నట్లు తీర్పునిచ్చారు.

Next Story