- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaipur Bomb Blast : జైపూర్ బాంబు పేలుళ్ల నిందితులకు జీవిత ఖైదు
by Muthe.Rajitha |
రాజస్థాన్ లోని జైపూర్ బాంబు పేలుళ్ళ(Jaipur Bomb Blast) నిందితులకు కోర్టు జీవిత ఖైదు శిక్ష(LifeTime Imprisonment) విధించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ లోని జైపూర్ బాంబు పేలుళ్ళ(Jaipur Bomb Blast) నిందితులకు కోర్టు జీవిత ఖైదు శిక్ష(LifeTime Imprisonment) విధించింది. జైపూర్‌లో 2008 మే 13న జరిగిన వరుస 8 బాంబు పేలుళ్లలో 71 మంది చనిపోగా, 180 మందికి పైగా గాయపడ్డారు. జోహరీ బజార్, త్రిపోలియా బజార్ లాంటి జనం ఎక్కువగా ఉండే చోట్ల ఈ వరుస పేలుళ్లు జరిగాయి. ఇండియన్ ముజాహిద్దీన్(Indian Mujahiddhin) అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు కారణమని తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన షాబాజ్ హుస్సేన్, సర్వర్ ఆజ్మీ, మొహమ్మద్ సైఫ్, సైఫుర్ రహమాన్‌లను దోషులుగా నిర్ధారించారు. వీరికి కోర్ట్ జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో 2019లో ఉరిశిక్ష పడినా, ఇప్పుడది జీవిత ఖైదుగా మారింది. రాజస్థాన్ పోలీసులు, NIA కలిసి దర్యాప్తు చేసి, సాక్ష్యాలతో నిందితులను పట్టుకున్నారు.
Next Story






