వాహనాల బ్యాన్ వద్దు.. ఢిల్లీ ప్రభుత్వానికి ఎల్జీ సక్సేనా లేఖ

by Phanindra |

పదేళ్లు పైబడిన వాహనాలపై బ్యాన్ నిర్ణయాన్ని అమలు చేయొద్దని, ఇది ఢిల్లీ ప్రజలకు అన్యాయంగా అనిపిస్తుందని రేఖ ప్రభుత్వానికి ఎల్జీ సక్సేనా లేఖ రాశారు.

వాహనాల బ్యాన్ వద్దు.. ఢిల్లీ ప్రభుత్వానికి ఎల్జీ సక్సేనా లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశరాజధాని ఢిల్లీలో పదేళ్లు పైబడిన వాహనాలపై నిషేధం విధించడం సరైన నిర్ణయం కాదని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని వివరిస్తూ ఢిల్లీ ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. పదేళ్లు పైబడిన డీజిల్ కార్లు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ కార్లపై బ్యాన్ విధించాలనే నిర్ణయాన్ని నిలిపివేయాలని ఆయన కోరారు. ఢిల్లీ ప్రజలు ఈ నిషేధానికి సిద్ధంగా లేరని ఆయన చెప్పారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టాప్ కోర్టుకు వివరించాలని తెలిపారు. మధ్యతరగతి ప్రజలు తమ డబ్బంతా పెట్టి కార్లు కొనుక్కుంటారని, పక్క రాష్ట్రాల్లో లేని నిషేధాన్ని ఢిల్లీలో అమలు చేయడం అన్యాయం అవుతుందని వీకే సక్సేనా అన్నారు.

Next Story