- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటి రష్మికకు భద్రత కల్పించండి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ
పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna)కు కొడవ సామాజికవర్గం మద్దతు తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna)కు కొడవ సామాజికవర్గం మద్దతు తెలిపింది. ఆమెకు తక్షణమే భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ సామాజికవర్గ అధ్యక్షుడు నాచప్ప లేఖ రాశారు. రష్మికపై ఎమ్మెల్యే రవి గనిగ విమర్శల నేపథ్యంలో కొడవ సామాజికవర్గం(Kodava Community) అండగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ఇటీవల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఈ ఈవెంట్‌కు రావాలని నిర్వహకులు ఆమెను ఆహ్వానించారు. అయితే.. అనుకోని కారణాల రీత్యా ఆమె హాజరు కాలేకపోయారు. దీంతో ఎమ్మెల్యే రవికుమార్(MLA Ravikumar) రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి కెరీర్ మొదలు పెట్టిన రష్మిక(Rashmika).. మూలాలు మర్చిపోతోందని, ఆమెకు కచ్చితంగా కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పి తీరాలని పిలుపునిచ్చినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
ఎమ్మెల్యే(MLA) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తర్వాత వివరణ కూడా ఇచ్చారు. రష్మికకు గుణపాఠం చెప్పాలంటే.. ఆమెపై దాడి చేయాలని అర్థం కాదు.. అని అన్నారు. ఆమెకు జీవితాన్ని ఇచ్చిన ప్రాంతానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. రష్మికపై వ్యక్తిగతంగా తనకేం కోపం లేదు.. ఆమె యాక్టింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం.. కానీ మూలాలు మర్చిపోకూడదు అని అన్నారు. దీంతో రష్మికకు ప్రమాదం పొంచి ఉంది.. ఆమెకు ప్రభుత్వాలు భద్రత కల్పించాలని కొడవ సామాజికవర్గం నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల వరుస హిట్లతో ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక మాంచి జోష్ మీదున్నది. గతేడాది చివరల్లో పుష్ప-2 పుష్ప-2 సినిమాతో గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న ఆమె.. ఈ ఏడాది ఛావా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నది. ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నారు. అవి షూటింగ్ దశలో ఉన్నాయి.
For More Movie News : https://www.dishadaily.com/movie






