- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్ లో 'వారికి' అండగా నిలుద్దాం! ఆర్ఎస్ఎస్
by Geesa Chandu |
గత కొద్ది రోజులుగా రిజర్వేషన్ లకు సంబంధించి బంగ్లాదేశ్ లో హింస చెలరేగుతుంది. మరో వైపు బంగ్లా - భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ ను విధించారు.

X
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా రిజర్వేషన్ లకు సంబంధించి బంగ్లాదేశ్ లో హింస చెలరేగుతుంది. మరో వైపు బంగ్లా - భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ ను విధించారు. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వ పాలన మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.! అయితే బంగ్లా దేశ్ లో ఉంటున్న హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న హింసపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ లో అధికార మార్పిడి కోసం జరుగుతున్న ఉద్యమంలో.. హిందూ, ఇతర మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆరెస్సెస్ కు చెందిన దత్తాత్రేయ హొసబలే అన్నారు. బంగ్లాలో హింసాత్మక ఘటనలను అరికట్టడానికి తక్షణమే కఠిన చర్యలను తీసుకోవాలని కోరారు. బాధితులందరికీ అండగా ఉంటూ వారి ప్రాణాలు, ఆస్తులను రక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.
Next Story






