- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొంతకాలం యుద్ధం జరిగితేనే మంచిది.. రష్యా-ఉక్రెయిన్ వార్‌పై ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కొంతకాలం యుద్ధం జరిగితేనే మంచిదన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ రెండు దేశాలను కొంత కాలం యుద్ధం చేయనివ్వడమే మంచిదని ఆయన అన్నారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌ను కలిసిన ట్రంప్.. ఈ యుద్ధాన్ని ఒకరంటే ఒకరికి ద్వేషం ఉన్న ఇద్దరు పిల్లల గొడవతో పోల్చారట. ‘కొన్నిసార్లు వాళ్లిద్దర్నీ కాసేపు కొట్టుకోనివ్వడమే మంచిది. ఆ తర్వాత వాళ్లను వెనక్కు లాగొచ్చు’ అని ట్రంప్ అన్నారు. ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా తను చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ యుద్ధం ఎంత దారుణంగా జరుగుతుందనే విషయంపై ట్రంప్, తను ఒకే అభిప్రాయంతో ఉన్నామని జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ అన్నారు. ఈ రక్తపాతాన్ని ఆపగలిగే కీలక వ్యక్తి ట్రంపే అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తాము ఈ పోరాటంలో ఉక్రెయిన్ వైపే ఉన్నామని, వాళ్లను బలోపేతం చేసేందుకు జర్మనీ ప్రయత్నిస్తోందని మెర్జ్ స్పష్టం చేశారు.






