- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోనమ్ వాంగ్‌చుక్‌కు పాక్‌తో లింకులు.. సంచలన విషయాలు చెప్పిన డీజీపీ
శనివారం సోనమ్ వాంగ్ చుక్ అరెస్టుపై లేహ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీజీపీ జామ్వాల్ సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్ కు చెందిన

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిరాహార దీక్ష చేపట్టి, నాయకత్వం వహించిన ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ ను శుక్రవారం లేహ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అరెస్ట్ చేసి రాజస్థాన్ లోని జోధ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. శనివారం సోనమ్ వాంగ్ చుక్ అరెస్టుపై లేహ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీజీపీ జామ్వాల్ సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్ కు చెందిన ఒక ఇంటెలిజెన్స్ అధికారితో సోనమ్ టచ్ లో ఉన్నట్లు చెప్పారు. ఆ అధికారిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇటీవల కాలంలో పాకిస్థాన్ లో జరిగిన డాన్ కార్యక్రమానికి సోనమ్ హాజరయ్యాడని, బంగ్లాదేశ్ ను కూడా సందర్శించాడని పేర్కొన్నారు. తరచూ ఆయాదేశాల పర్యటనకు వెళ్తుండటం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈనెల 24న లేహ్ లో జరిగిన హింసాత్మక సంఘటనలకు కారణం వాంగ్ చుక్ అన్న జామ్వాల్.. ఈ హింసలో నలుగురు మరణించినట్లు తెలిపారు. మరో 80 మంది వరకూ గాయపడ్డారని వివరించారు. అరబ్ స్ర్పింగ్, నేపాల్ జెన్-Z అల్లర్ల గురించి వాంగ్ చుక్ ప్రస్తావించడంతోనే అల్లర్లు చెలరేగాయని, ఫలితంగా లేహ్ లో బీజేపీ ఆఫీస్ సహా కొన్ని ప్రభుత్వ వాహనాలు తగలబడ్డాయని హోంమంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆయనకు రెచ్చగొట్టే చరిత్ర ఉందని FCRA ఉల్లంఘనకు సంబంధించి దర్యాప్తు జరుగుతుందని డీజీపీ జామ్వాల్ తెలిపారు.






